ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మోహన్ బాబు ఇంట పండుగ రోజు!

Mon, Oct 08, 2012
మంచు లక్ష్మీ ప్రసన్న
మంచు లక్ష్మీ ప్రసన్న
     ఈ రోజు మంచు లక్ష్మీ  పుట్టినరోజు కావడం వల్ల మోహన్ బాబు కుటుంబ సభ్యులకు
పండుగ రోజేనని చెప్పొచ్చు. కూతురంటే మోహన్ బాబుకి పంచ ప్రాణాలు ... అదే
విధంగా తండ్రి అంటే ఆమెకి అమితమైన అనురాగం. తండ్రి కార్యదీక్ష ... ఆయన
క్రమశిక్షణ ... ఆయన ధైర్య సాహసాలు లక్ష్మిని ఎంతగానో ప్రభావితం చేశాయి.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన లక్ష్మీ, భర్త ప్రోత్సాహంతో అక్కడి
ప్రముఖ టీవీ చానల్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇండియాకి తిరిగి వచ్చాక
ఓ టీవీ చానల్లో 'లక్ష్మీ టాక్ షో' కి వ్యాఖ్యాతగా వ్యవహరించి తనకంటూ ఓ
ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

     ఆ తరువాత ఓ వైపున నటిగా అందరి
ప్రశంసలు అందుకుంటూనే, మరో వైపున నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది. 'నేను మీకు తెలుసా' ... 'ఝుమ్మంది నాదం' ... 'ఊకొడతారా ఉలిక్కిపడతారా' చిత్రాలను
నిర్మించింది. ఇక ఆమె నటిస్తూ నిర్మిస్తోన్న 'గుండెల్లో గోదారి' చిత్రం
త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇలా వ్యాఖ్యాతగా ... నటిగా ...
నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞను ఆవిష్కరిస్తోన్న లక్ష్మీకి పుట్టినరోజు
శుభాకాంక్షలు అందజేస్తోంది ap7am.com        
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)