ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మణిరత్నం సినిమాలో ఐశ్వర్య రాయ్!

Tue, Oct 02, 2012
ఐశ్వర్య రాయ్
ఐశ్వర్య రాయ్
     వెండితెరపై వెన్నెల జాబిల్లిలా కనిపించే ఐశ్వర్య రాయ్ రీ ఎంట్రీ కోసం
కొన్ని లక్షలమంది అభిమానులు ఆశగా ... ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ
నేపథ్యంలో ఐశ్వర్య ఫలానా సినిమాలో నటించడానికి అంగీకరించిందటా! అంటూ ఎన్నో
రకాల పుకార్లు రాజ్యమేలుతూ వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ఐశ్వర్య కూడా కలుగ
జేసుకుని, తన కూతురు ఆలనా పాలన చూసుకోవడంలో తీరిక లేకుండా ఉన్నాననీ ... రీ
ఎంట్రీ విషయమై తానింకా ఏమీ ఆలోచించుకోలేదని చెప్పింది. అయితే తాజాగా ఆమె
మణిరత్నం సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు బాలీవుడ్ లో షికారు
చేస్తున్నాయి.

     దర్శకుడిగా మణిరత్నం పైనా ... ఆయన ఎంచుకునే కథ పైనా
నమ్మకంతోనే ఐశ్వర్య ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. 1938 లో వచ్చిన
'రెబక్కా' అనే నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు
చెబుతున్నారు. కొత్తగా పెళ్ళైన ఓ యువతీ తన భర్త మనసెరిగి నడుచుకోవడానికి
ఎంతగా ఆరాటపడిందనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందట.  ప్రస్తుతం మణిరత్నం ఈ
సినిమా స్క్రిప్ట్ పైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఏదేవైనా ఈ విషయంలో
నిజానిజాలు తేలాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.  
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)