ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హిందీ 'ఈగ' పై అజయ్ దేవగణ్ అభిమానం

Thu, Sep 27, 2012
అజయ్ దేవగణ్
అజయ్ దేవగణ్
     తెలుగులో రాజమౌళి మంత్రించి వదిలిన 'ఈగ' అన్ని ప్రాంతాలను దాటుకుంటూ విజయ
పథంలో ముందుకు దూసుకు పోతోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను 'మక్కి' పేరుతో  హిందీలోకి అనువదించి
అక్టోబర్ 12 న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ
సినిమా ప్రారంభంలో వచ్చే వాయిస్ ఇవ్వడానికి బాలీవుడ్ కథానాయకుడు అజయ్
దేవగణ్ అంగీకరించాడు.

     ఈ సినిమా ప్రారంభంలో ఓ పాపకి కథ చెబుతూ బ్యాగ్రౌండులో
రాజమౌళి వాయిస్ వస్తుంది. ప్రేక్షకులను అసలు కథలోకి తీసుకెళ్లే అంశం ఇదే.
తెలుగులో రాజమౌళి వాయిస్ వచ్చిన చోట హిందీలో అజయ్ వాయిస్ వస్తుంది. ఈ
సినిమాను అజయ్ నిన్ననే చూశాడనీ, తనకి ఎంతగానో నచ్చడంతో వాయిస్ ఇవ్వడానికి
అంగీకరించాడని రాజమౌళి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అజయ్ కి
ధన్యవాదాలు కూడా తెలియజేశారు.  
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)