ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కరీనాని కలవరపెట్టిన లేఖలు!

Mon, Sep 24, 2012
కరీనా కపూర్
కరీనా కపూర్
     అందాల కథానాయికలకు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వాళ్ల నుంచి వచ్చే
అభినందనలు అందుకుంటూ ఈ తారలు మురిసి పోతుంటారు ...  ఒక్కోసారి మైమరిచి
పోతుంటారు కూడా. బాలీవుడ్ తెరను భారీ స్థాయిలో ఏలేస్తోన్న కరీనా కపూర్ కి
సహజంగానే ఇలాంటి అనుభవాలు ... అనుభూతులు ఎదురౌతూనే ఉంటాయి. అయితే తాజాగా
తనకి వచ్చిన లేఖలు ఆమెకు తీవ్ర మైన కలవరపాటును కలిగించాయని అంటున్నారు.
కరీనా ఇటీవల 'హీరోయిన్' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో
ఆమె ఉఫ్ .. ఉఫ్ ... మంటూ సిగరెట్లు ఊది పారేయడం విడుదలకి ముందే సంచలనమైంది.
అయితే పాత్ర డిమాండ్ చేయడంతో తప్పలేదని కరీనా ఎప్పటి పాటే పాడింది.

     ఇక
ఇప్పుడు ఈ సినిమా వాల్ పోస్టర్ల పై ఆమె సిగరెట్ తాగుతూ ఇచ్చిన పోజులు,
ఢిల్లీ స్కూలు పిల్లలలకి తీవ్రమైన అసహనాన్ని కలిగించాయి. దాంతో ఇకపై అలాంటి
సన్నివేశాల్లో నటించవద్దంటూ ఆమెకి మూకుమ్మడిగా లేఖలు రాశారు. అదే తరహాలో
ఇక పై ఇలాంటి దృశ్యాలను తెరకెక్కించ వద్దంటూ ఈ సినిమా దర్శకుడు మాధుర్
భండార్కర్ కి కూడా ఆ లేఖలను పోస్ట్ చేసారు. పెద్ద స్థాయిలో పిల్లలు
సంధించిన ఈ విమర్శనాస్త్రాలు వీల్లిద్దరిని కలవరపెట్టాయనే వార్తలు బాలీవుడ్
లో షికారు చేస్తున్నాయి.  
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)