ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొత్తదనం కోసం మనోజ్ కసరత్తు

Sat, Sep 22, 2012
మనోజ్
మనోజ్
     తెలుగు తెర పై చురుకుగా ... చలాకీగా సందడి చేసే యువ కథానాయకుల్లో మనోజ్
ముందువరుసలో కనిపిస్తాడు. మనోజ్ సినిమాల జయాపజయాలను పక్కనపెడితే, వైవిధ్య
భరితమైన పాత్రలను ఎంచుకోవడంలో అతను శ్రద్ధ చూపిస్తాడనే విషయం అర్ధమై
పోతుంది. 'మిస్టర్ నూకయ్య' ... 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' సినిమాలు ఆశించిన
స్థాయి విజయాలను అందుకోలేకపోయినా, పాత్ర పరంగా తన నటనలోని విభిన్నమైన
కోణాల్ని అతను అద్భుతంగా ఆవిష్కరించాడు.

     ఇటీవల బరువు తగ్గడంపై
దృష్టిపెట్టిన మనోజ్, తాజాగా రెండు సినిమాలను అంగీకరించినట్టు
చెబుతున్నాడు. ఈ సినిమాలకి సంబంధించిన కథలు రొటీన్ కి భిన్నంగా ఉన్నాయనీ,
తనకి బాగా నచ్చడంతో అంగీకరించానని అంటున్నాడు. తన నుంచి కొత్తదనాన్ని
కోరుకునే ప్రేక్షకులకి ఈ సినిమాలు సంతృప్తిని కలిగిస్తాయనీ, త్వరలోనే
వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడి చేస్తానని చెబుతున్నాడు. 
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)