ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూరీ క్లాప్ తో మొదలైన మరో ప్రేమకథ!

Thu, Sep 20, 2012
సాయిరామ్ శంకర్ -  జాస్మిన్
సాయిరామ్ శంకర్ - జాస్మిన్
     పూరీ క్లాపుతో మరో ప్రేమ కథ మొదలైంది. తెలుగు తెర పై సందడి చేయనున్న ఈ
ప్రేమకథకి నాయకుడు సాయిరామ్ శంకర్ అయితే నాయిక జాస్మిన్. వీళ్లిద్దరి
కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ - ఫిల్మ్
నగర్ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం తొలి
సన్నివేశానికి పూరీ జగన్నాథ్ క్లాప్ ఇవ్వగా, మాజీ మంత్రి కేవీ కేశవులు
కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశాన్ని వెంకటేశ్వరస్వామి పై
చిత్రీకరించారు. సౌదామిని క్రియేషన్స్ బ్యానరు పై వేణుగోపాల్ నిర్మిస్తోన్న
ఈ సినిమాకి, జయరవీంద్ర దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

     ఈ సందర్భంగా దర్శక
నిర్మాతలు మాట్లాడుతూ, రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ
సినిమా, రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు. ఈ సినిమా
ద్వారా జాస్మిన్ కథానాయికగా పరిచయం అవుతోందనీ ... డిసెంబరులో సినిమాను
విడుదల చేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న
ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకముందని చెప్పారు.    
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)