ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుదీప్ జోడీగా సలోని!

Fri, Sep 14, 2012
సుదీప్ - సలోని
సుదీప్ - సలోని
     'ఈగ' చిత్రంలో విలన్ గా నటించిన సుదీప్ కన్నడ చిత్ర పరిశ్రమలో ముందువరుసలో
ఉన్న కథానాయకుడు. ఆయన హీరోగా కన్నడలో చేసిన ఓ సినిమాని తెలుగులో 'రౌడీ
సింహా' పేరుతో అనువదిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన జోడీగా సలోని
కనిపించనుంది. సాధు కోకిల తెరకెక్కించిన ఈ సినిమాకి ఎస్.ఆర్.జి. ప్రసాద్
అనువాద నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కన్నడలో ఈ
సినిమా ఘన విజయాన్ని సాధించిందని చెప్పారు. సుదీప్ పాల్గొన్న యాక్షన్
దృశ్యాలు ... సలోని అందచందాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని
అన్నారు. 'ఈగ' సినిమాలో విలన్ గా మెప్పించిన సుదీప్, 'మర్యాదరామన్న'
చిత్రంలో కథానాయికగా అలరించిన సలోని కాంబినేషన్లో ఈ సినిమా వస్తోండటం వల్ల,
తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకముందని చెప్పారు. యాక్షన్
ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను అక్టోబరులో విడుదల చేయనున్నామని
అన్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)