ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అపార్ధం చేసుకోవద్దంటోన్న ప్రియా ఆనంద్

Fri, Sep 14, 2012
ప్రియా ఆనంద్
ప్రియా ఆనంద్
     హీరో సిద్ధార్థ్ తనకి మంచి స్నేహితుడు మాత్రమేననీ ... తమ స్నేహాన్ని
అపార్ధం చేసుకోవద్దని కోరుతోంది ప్రియా ఆనంద్. వీళ్లిద్దరి మధ్య  ఏదో
ఉందంటూ కొంత కాలంగా జరుగుతోన్న ప్రచారం గురించి మాట్లాడుతూ ఆమె పై విధంగా
స్పందించింది. గతంలో సిద్ధార్థ్ ... ప్రియా ఆనంద్ '180 ' అనే చిత్రంలో
నటించారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే ప్రచారం అప్పట్లోనే
జరిగింది. మరి మళ్లీ ఆ విషయం తెరపైకి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, ఈ
వార్తలను ఖండిస్తూ ప్రియా ఆనంద్ రంగంలోకి దిగింది.

     సిద్ధార్థ్ తనకి మంచి
మిత్రుడనీ ... అతనితో లేనిపోని సంబంధాన్ని అంటగడుతూ తమని ఇబ్బంది
పెట్టొద్దని చెప్పింది. తాను సిద్ధార్థ్ ను కలుసుకోక చాలా కాలమైందనీ ... తన
దృష్టి అంతా కెరియరు పైనే ఉందని అంది. అసలు వీరిద్దరి కాంబినేషన్లో '180 '
అనే సినిమా వచ్చిన విషయమే చాలా మందికి తెలియదు. పైగా వీళ్లు
ప్రేమించుకున్నా లేకపోయినా ఆ వ్యవహారాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోనూ లేదు.
మరి హఠాత్తుగా ఈ ఖండనలు ... వివరణలు ఎందుకనో తెలియక చాలా మంది
సతమతమైపోతున్నారట.  
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)