ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనుమానాలకి తెరతీసిన కరీనా కపూర్!

Fri, Sep 14, 2012
కరీనా - సైఫ్
కరీనా - సైఫ్
        అసాధారణమైన
అందం ... అసమానమైన అభినయం ... ఈ రెండింటిని అలంకారాలుగా చేసుకున్న
కథానాయిక కరీనా కపూర్. బాలీవుడ్ తెరను ... భారీ సంఖ్యలో ప్రేక్షకుల
హృదయాలను ఆమె ఏళ్ల తరబడి ఏలేస్తోంది. అలాంటి కరీనా అగ్ర కథానాయికగానే కాదు,
సైఫ్ అలీఖాన్ ప్రియురాలిగా కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తోంది.
చాలాకాలంగా జరుగుతోన్న వారి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకూ విస్తరించింది.
అయితే అనేక కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చిన ఈ పెళ్లి, ఈ అక్టోబర్ 17 న
జరగనున్నట్టు తెలుస్తోంది.
     
      ఈ విషయంగా కరీనా మీడియాతో
మాట్లాడుతూ, పెళ్లి తరువాత తన పేరును కరీనా కపూర్ ఖాన్ గా
మార్చుకోనున్నట్టు వెల్లడించింది. దాంతో ఆమె అనేక అనుమానాలకి తెరతీసినట్టు
చెప్పుకుంటున్నారు. సైఫ్ అలీఖాన్ కోసం కరీనా ఇస్లాం మతాన్ని
స్వీకరిస్తోందనీ ...
అందుకనే ఆమె తన పేరును అలా మార్చుకుంటున్నట్టు చెప్పిందని అంతా
అనుకుంటున్నారు. అయితే కపూర్ వంశ పరువు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకున్న
ఆమె, తన పేరులో 'కపూర్' ను తొలగించుకోవడానికి మాత్రం ఇష్టపడటంలేదని
అంటున్నారు. ఈ నేపథ్యంలో మతం మార్పిడి అనేది తన వ్యక్తిగత విషయమని కరీనా
చెబుతూ ఉంటే, ఆ విషయంలో ఆమెని తాను ఏ మాత్రం ఒత్తిడి చేయదలచుకోలేదని సైఫ్
అలీఖాన్ అంటుండటం విశేషం.






X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)