ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెండితెరపై దేవుడిగా రజనీకాంత్

Fri, Sep 14, 2012
రజనీకాంత్
రజనీకాంత్
     ఔను ... తమిళ ప్రేక్షకులు దేవుడుగా భావించే రజనీకాంత్ ఇప్పుడు అదే
ప్రేక్షకుల కోసం దేవుడిగా కనిపించనున్నారు. ధనుష్ హీరోగా చేయనున్న ఓ తమిళ
చిత్రంలో ఆయన దేవుడి రూపంలో అభిమానులకి కనువిందు కలిగించనున్నారు. హిందీలో
అక్షయ్ కుమార్ ... మిథున్ చక్రవర్తి ... పరేష్ రావెల్ ప్రధాన పాత్రధారులుగా
'OMG  ఓ మై గాడ్' అనే చిత్రం రూపొందుతోంది. భారీ బడ్జెట్టుతో తెర
కెక్కుతోన్న ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత కృష్ణ
ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

      ధనుష్ కథానాయకుడిగా రూపొందనున్న ఈ
సినిమాలో రజనీకాంత్ దేవుడిగా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా భారీ
స్థాయిలో బిజినెస్ జరుపుకోవడానికి ఈ ఒక్క విశేషం చాలని పరిశీలకులు
అంటున్నారు. ఈ విషయం ఇలా కోలీవుడ్ లో బయటకి వచ్చిందో లేదో అప్పుడే అక్కడ
అంచనాలు ... చర్చలు మొదలైనాయట. ఇదిలా ఉంటే రజనీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్'
చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకిరానుంది. రజనీకాంత్ పుట్టిన రోజుని
పురస్కరించుకుని ఈ సినిమాని 12 -12 - 12 న విడుదల చేస్తున్నారు
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)