ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చీటింగ్ కేసులో చిక్కుకున్న జీవితా రాజశేఖర్!

Thu, Sep 13, 2012
జీవితా రాజశేఖర్
జీవితా రాజశేఖర్
రాజశేఖర్ సినిమాలకు దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తోన్న జీవితా రాజశేఖర్ ఓ
చీటింగ్ కేసులో చిక్కుకుంది. దాంతో ఆమె పై కేసు నమోదు చేయవలసినదిగా
బంజారాహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. విషయమేమిటంటే ...
రాజశేఖర్ హీరోగా జీవిత 'మహంకాళి' అనే చిత్రాన్ని తెరకెక్కి స్తోంది. ఈ
సినిమా కోసం ఆమె వై.సురేందర్ రెడ్డి అనే నిర్మాత దగ్గర కోటి రూపాయలకి పైగా
ఫైనాన్స్ తీసుకుంది. అయితే సురేందర్ రెడ్డి తో ఆమె చేసుకున్న ఒప్పందానికి
విరుద్ధంగా, అతని అనుమతి లేకుండానే ఆ సినిమా హక్కులను వేరొకరికి
అమ్మేసింది. దాంతో ఆమె తనని మోసం చేసిందంటూ సురేందర్ రెడ్డి కోర్టును
ఆశ్రయించాడు. అతని అభ్యర్ధనను పరిశీలించిన కోర్టు, జీవితా రాజశేఖర్ పై కేసు
నమోదు చేసి విచారణ జరపవలసిందిగా పోలీసులను ఆదేశించింది.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)