ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రూటు మార్చిన కథానాయకుడు!

Tue, Sep 11, 2012
జగపతిబాబు
జగపతిబాబు
జగపతిబాబు ... మాస్ ఆడియన్స్ తో పాటు మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలను
అందుకున్న అరుదైన కథానాయకుడు. హీరోగా విభిన్నమైన పాత్రలను పోషించి
మెప్పించిన జగపతిబాబు, ఈ మధ్య తన రూటు మార్చాడు. హీరోగా అవకాశాలు
తగ్గుతోన్న సమయంలో ఆయన తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే పనిలో పడ్డాడు.
కథకి ఆయువు పట్టుగా నిలిచే ప్రధాన పాత్రలను పోషించడానికి ఆయన సమాయత్తమై
పోయాడు. ఫలితంగా చాలా సినిమాల్లోని ఆ తరహా పాత్రలు ఆయనని వెదుక్కుంటూ
వస్తున్నాయి. దాంతో ప్రస్తుతం ఆయన డేట్స్ దొరకడం కష్టమై పోతోందని
తెలుస్తోంది. విక్రమ్ హీరోగా చేసిన 'తాండవం' చిత్రంలో జగపతిబాబు ఓ కీలకమైన
పాత్రని పోషించాడు. ఈ సినిమా తెలుగులో 'శివతాండవం' పేరుతో ప్రేక్షకుల
ముందుకి రానుంది. ఇక 'ఏప్రిల్ ఫూల్' చిత్రంలోనూ ఆయన ఓ ప్రత్యేక పాత్రలో
కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో
షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఆయన '6 ' అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో
సైతం ఓ ముఖ్య భూమికను పోషిస్తున్నాడు. క్రేజ్ ఉన్న ఈ కథానాయకుడు ఒక్కసారిగా
తన రూటు మార్చేసి, ఇలా ఏ మాత్రం ఖాళీగా లేకుండా ప్రేక్షకులకి మరింత
చేరువౌతుండటం విశేషమేనని అంతా చెప్పుకుంటున్నారు. 
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)