ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎ. ఆర్. రహ్మాన్ కు అరుదైన సత్కారం

Mon, Sep 10, 2012
సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన స్వర మాంత్రికుడు
ఎ.ఆర్.రెహమాన్, బహు సుందరమైన బాణీలు అందిచటం మొదలు పెట్టి అప్పుడే ఇరవై
యేళ్ళు గడచిపోయాయి. 1992 లో మణిరత్నం తెరకెక్కించిన 'రోజా'
సినిమాతో సంగీత దర్శకుడుగా ఎ.ఆర్.రెహ్మాన్ వెండితెరకి పరిచయం అయ్యాడు. తొలి
చిత్రంలోనే సమ్మోహన కరమైన సంగీతాన్ని అందించి, అనతి కాలంలోనే
సంగీత ప్రియుల హృదయాలలో చెరగని ముద్ర వేసాడు. తన ప్రతిభకి తగిన 
పురస్కారంగా ఈ సినిమాకు గాను ఆయన ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును
అందుకున్నాడు. ఈ సంగీత సంచలనం తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇరవై  వసంతాలు
పూర్తి అయిన సందర్భంగా, భారీ స్థాయిలో ఓ వేడుకను జరుపనున్నారు. చెన్నైలో
అక్టోబర్ 21 న అత్యంత వైభవంగా నిర్వహిస్తోన్న ఈ అపూర్వమైన కార్యక్రమానికి,
వివిధ రంగాలకి చెందిన ప్రముఖలు హాజరు కానున్నారు.  'ఇసై పుయల్' ... 'ది
మాన్..ది మ్యూజిక్..ది మేజిక్..' అనే పేరుతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం
జరగనుంది. నయనానందకరంగా ... శ్రవణానందకరంగా జరగనున్న కమనీయమైన ఈ కార్యక్రమం
కోసం సంగీతాభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)