ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొత్తగా కనిపించనున్న మనోజ్

Sat, Sep 08, 2012
మంచు మనోజ్ ఇక తన అభిమానులకు కొత్తగా కనిపించనున్నాడు. అందుకోసం బ్యాంకాక్
వెళ్లి మరీ నానా తంటాలు పడుతున్నాడు. గడచిన మూడు నెలలలో తాను 6 కేజీల వరకూ
బరువు పెరిగాననీ ... ఇప్పుడు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నానని
ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇందు కోసం బ్యాంకాక్ లో ట్రీట్మెంట్
తీసుకుంటున్నట్టుగా తెలియజేశాడు. ఈ మధ్య కాలంలో సినిమాల హడావిడిలో పడిపోయి
మనోజ్ సరిగ్గా డైట్ మెయిన్టెయిన్ చేయలేదనీ ... అందువల్లనే బరువు
పెరిగిపోయాడని అంటున్నారు. కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతోనే ఆయన ఇలా ట్రీట్
మెంట్ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. అయితే గతంలో విష్ణు కూడా
అనుకున్నదాని కంటే ఎక్కువగా సన్నబడిపోయి ఆకర్షణీయమైన ఆకృతిని కోల్పోయాడు.
సక్సెస్ ల సంగతేమోగానీ అసలు అవకాశాలు లేకుండా పోయాయి. మరి ఇప్పటి వరకూ
ముచ్చటగానే కనిపించిన మనోజ్, ఈ ట్రీట్మెంటుతో ప్రేక్షకులను మెప్పిస్తాడో
... నొప్పిస్తాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)