ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భయపెడుతోన్న'విశ్వ రూపం'

Tue, Sep 04, 2012
      ఔను ... రేటు విషయంలో ఈ సినిమా డిస్ట్రి బ్యూటర్లను భయపెడుతోందట. దాదాపు
150 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఎక్కువ రేటు
చెబుతున్నారట. దాంతో డిస్ట్రి బ్యూటర్లు కొనడానికి ధైర్యం చేయడంలేదనే
వార్తలు కోలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఈ నెల 24 న
ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. అయితే భారీ రేటు చెబుతుండటంతో
డిస్ట్రి బ్యూటర్లు కొనడానికి రాకపోవడంతో, ఈ సినిమాను అనుకున్న సమయానికి
విడుదల చేయలేక పోతున్నారని తెలుస్తోంది.
       అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో
రూపొందిన ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి
పరిస్థితుల్లో అసలు డిస్ట్రి బ్యూటర్లు ముందుకు రావడంలేదనే విషయమే అందరినీ
ఆశ్చర్య పరుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కమల్ ఏ నిర్ణయం
తీసుకోనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచ దేశాలకి తలనొప్పిగా మారిన
ఉగ్ర వాదాన్ని కథావస్తువుగా చేసుకుని కమల్ తెరకెక్కించిన ఈ సినిమాలో, ఆయనతో
పాటు సమీరారెడ్డి ... పూజా కుమార్ ... రాహుల్ బోస్ ... ఆండ్రియా ప్రధాన
పాత్రలు పోషించారు.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)