ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహానటి మంచి మనసు

Tue, Sep 04, 2012
       సినీ తారలు తెర పై అందంగా కనిపిస్తారు ... కనిపించిన ఆ కాసేపు సంతోషాల
సందడి చేస్తారు. ఇక వాళ్లకి పేరుకు పేరు ... డబ్బుకు డబ్బు అని అంతా
అనుకుంటారు. సినీ తారల తళుకు బెళుకుల వెనుక అందమైన అగాధాలు ఉంటాయనీ ...
కనువిందుచేసే వాళ్ల రూపం వెనుక కన్నీటి చారలు ఉంటాయని చాలా మందికి తెలియదు.
అందుకే కొంత మంది అమ్మాయిలు సినీ తారలుగా వెలుగొందాలని కలలు కంటూ నగరాలకి
వచ్చి మోసగాళ్ల బారిన పడుతుంటారు. అలాంటి ఎంతో మంది అమ్మాయిలకు నచ్చజెప్పి
వాళ్లు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకునేలా చేసింది మహానటి సావిత్రి. ఓ సారి
ఆమె షూటింగ్ ముగించుకుని కార్లో ఇంటికి బయలుదేరుతుండగా, అక్కడ తచ్చాడుతూ ఓ
ఇద్దరు అమ్మాయిలు కన్పించడంతో వెంటనే కారాపి వాళ్లని కూడా తీసుకుని తన
ఇంటికి చేరుకుంది.

        ఆ అమ్మాయిలకు సావిత్రి కారు ఎక్కామనే ఆనందం ఏ మాత్రం
లేదు. ఎందుకంటే ఆమె కాస్త గంభీరంగా కనిపించడమే. ఆ అమ్మాయిలకు కాఫీ కలిపి
ఇచ్చిన సావిత్రి వాళ్ల వివరాలను అడిగింది. సినిమాల్లో నటించాలనే కోరికతో
తాము ఇంట్లో చెప్పకుండా వచ్చామనీ ... అయితే ఎవరిని కలుసుకోవాలో తమకి
తెలియడంలేదని వాళ్లు చెప్పారు. చెన్నైలో తమకి ఎవరూ తెలియక పోవడంవల్ల
పదిరోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నామనీ ... తెచ్చుకున్న డబ్బు కూడా
అయిపోయిందని  కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో సావిత్రి వాళ్లని
ఓదార్చింది. సినిమాల్లో నిలదొక్కుకున్న కొందరిని చూసి ఇక్కడందరూ సుఖ
శాంతులతో ఉన్నారనుకోవడం పొరపాటనీ ... అండదండలు లేకుండా ఆడపిల్లలు సినిమాల
వైపుకు రాకూడదని సావిత్రి వాళ్లకి నచ్చ జెప్పింది. కన్నవాళ్ళను
బాధపెట్టకుండా మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేసుకోమని హితవు చెప్పింది.
వాళ్లకి కొత్త బట్టలు పెట్టి కొత్త డబ్బిచ్చి తన కారు డ్రైవరు సుబ్బారావుని
తోడుగా ఇచ్చి వాళ్లని సొంత ఊరికి పంపించింది. అందుకే సావిత్రి మహానటే కాదు
... అంతకు మించిన మనసున్న మనిషి అని అందరూ అంటూ ఉంటారు.   
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)