ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పెద్దాయనకి కోపం తెప్పించిన సావిత్రి

Fri, Aug 31, 2012
సావిత్రి
సావిత్రి
     చెన్నైలోని మోడరన్ స్టూడియో గతంలో
ఓ వెలుగు వెలిగింది. వివిధ భాషలకి సంబంధించిన సినిమాల షూటింగులు అక్కడ
రెగ్యులర్ గా జరుగుతూ ఉండేవి. ఆ స్టూడియో అధినేత సుందరం అంటే అందరికీ హడల్.
స్టూడియో నిర్వహణ విషయంలోనూ ... తాను నిర్మిస్తోన్న సినిమాల విషయంలోనూ ఆయన
చాలా డిసిప్లిన్ గా వుండేవారట. బాయ్ దగ్గరనుంచి ప్రతి ఒక్కరూ డిసిప్లిన్
గా ఉండాలని ఆయన భావించేవారు. 'సహస్ర శిరశ్చేద అపూర్వ చింతామణి' చిత్రాన్ని
ఆయన మొదట జగ్గయ్య కథానాయకుడిగా నిర్మించారు. అయితే, షూటింగ్ చివరి రోజున ...
స్టూడియో నిబంధనలకి విరుద్ధంగా జగ్గయ్య సెట్లో సిగరెట్ కాల్చాడట. అంతే
అప్పటివరకూ తీసిన ఫిల్మ్ ను అలాగే పక్కన పడేసి, కాంతారావుతో సినిమా
మొత్తాన్ని రీ షూట్ చేయించారట.

    అందువల్ల ఆయన గురించి తెలిసిన వాళ్లంతా
స్టూడియో నుంచి బయట పడేంత వరకూ చాలా జాగ్రత్తగా ఉండేవారు. అలాంటి
పరిస్థితుల్లో ఆ స్టూడియోలో 'మహేశ్వరి' అనే తమిళ చిత్రం షూటింగ్
జరుగుతోంది. ఈ సినిమాలో జెమిని గణేష్ - సావిత్రి నాయకా నాయికలు. అప్పటికే
ప్రేమించుకుంటోన్న వాళ్లిద్దరూ షూటింగ్ గ్యాపులో స్టూడియోలో కాస్త చనువుగా
మసలుకుంటూ సుందరం కంట్లో పడ్డారు. అంతే ఆయన అగ్గి మీద గుగ్గిలమౌతూ,
'మహేశ్వరి' సినిమా దర్శకుడు రఘునాథ్ ను పిలిపించారు. తన స్టూడియో ప్రేమ
కలాపాలకు విడిది కేంద్రం కాదనీ ... వెంటనే షూటింగ్ ఆపేసి, పేకప్ చెప్పేయమని
ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. విషయం అర్ధం కావడంతో దర్శకుడితో పాటు మిగతా
వాళ్లంతా ఆయనను బతిమాలడంతో అతి కష్టం మీద ఆయన శాంతించారట.       
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)