ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సావిత్రిని భయపెట్టిన 'గోదావరి'

Sat, Aug 25, 2012
సావిత్రి
సావిత్రి
    తెలుగు తెరపై మకుటంలేని మహారాణిగా
వెలుగొందిన అందాల అభినేత్రి సావిత్రి. అలాంటి సావిత్రిని పరవళ్లు తొక్కే గోదావరి ఓసారి తెగ భయపెట్టింది. సావిత్రిని
చివరివరకూ వెంటాడిన ఈ  సంఘటన 1963 లో జరిగింది. ఆ ఏడాది ఆమె 'మూగమనసులు'
... 'డాక్టర్ చక్రవర్తి' ... 'పూజాఫలం' చిత్రాల్లో నటించింది. ఈ
నేపథ్యంలో ఆమె 'మూగ మనసులు' సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్లవలసి
వచ్చింది. పసి వయసులో ఉన్న తన కూతురిని వదిలి వెళ్లడం ఇష్టం లేకపోయినా,
తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఆ షూటింగుకు వెళ్లింది.

    రాజమండ్రి - గోదావరిలో
''ఈనాటి ఈ బంధమేనాటిదో ...'' పాటను పడవలో ఉన్న అక్కినేని - సావిత్రిపై
చిత్రీకరిస్తున్నారు. అలా నదిలో పడవ కొంత దూరం వెళ్ళాక ... ఈ పాటలోని ఓ
చరణాన్ని పాడుతూ నటనలో భాగంగా సావిత్రి వైపు అక్కినేని చూడాలి. ఆయన అలానే
పాటకి తగినట్టుగా లిప్ మూవ్ మెంట్ ఇస్తూ సావిత్రి వైపు చూశారు.

    కానీ ఆమె
అక్కడ లేకపోవడంతో అక్కినేని గుండె ఝల్లుమంది. ఆయన అనుకున్నట్టే పడవలో నుంచి
పడిపోయిన సావిత్రి గోదావరిలో మునుగుతూ తేలుతూ కనిపించింది. దాంతో
అక్కినేని పెద్దగా కేకలు వేయడంతో పడవను ఆపేశారు. అప్పటికే నీళ్ళు తాగేసిన
కారణంగా ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఆ పడవ అంచుని పట్టుకుని వేలాడుతున్న
సావిత్రిని అక్కినేని అతి కష్టం మీద పైకి లాగారు.

    సావిత్రిని క్షేమంగా
ఒడ్డుకి చేర్చినప్పటికీ ఆమె ఆ షాక్ నుంచి తేరుకోలేదట. తనకేదైనా జరిగి ఉంటే
తన కూతురు ఏమైపోయేదోనని తలుచుకుంటూ చాలా సేపు ఆ షాక్ లోనే వుండిపోవడంతో ఆ
రోజుకి షూటింగ్ ఆపేశారు. ఈ సంఘటన తరువాత ఇంకెప్పుడూ గోదావరి వైపు రాకూడదని
సావిత్రి నిర్ణయించుకుందట. 
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)