ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పేరు మార్చుకున్న సంగీత దర్శకుడు

Tue, Aug 21, 2012
కల్యాణి
కల్యాణి
      తెలుగు పాటకి తనదైన సంగీతాన్ని
అందిస్తూ, అలరిస్తోన్న సంగీత దర్శకుల్లో కల్యాణి మాలిక్ ఒకరు. ప్రముఖ సంగీత
దర్శకుడు కీరవాణి సోదరుడైన కల్యాణి మాలిక్, సంగీత దర్శకుడిగా ప్రేక్షకుల
హృదయాలపై తనదైన ముద్ర వేశారు. 'ఐతే' ... 'ఆంధ్రుడు' ... ' బాస్' ... 'అష్టా
చెమ్మా' ... 'అలామోదలైంది' ... 'అధినాయకుడు' వంటి చిత్రాల్లోని పాటలు,
విభిన్నమైన ఆయన బాణీలకు అద్దం పడతాయి. ఈ సినిమాలకి ఆయన స్వరపరిచిన పాటలు
ప్రత్యేకంగా అనిపించడమే కాకుండా మంచి పేరు తెచ్చి పెట్టాయి.

    ఈ నేపథ్యంలోనే
ఆయన తన స్క్రీన్ నేమ్ 'కల్యాణి మాలిక్' ను 'కల్యాణి' గా మార్చుకున్నట్టుగా
ప్రకటించారు. ఇక సంగీత దర్శకుడిగా తన కొత్త పేరు ఇంద్రగంటి మోహన కృష్ణ
దర్శకుడిగా వ్యవహరిస్తోన్న సినిమా నుంచి స్క్రీన్ పై కనిపిస్తుందని ఆయన
చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సంఖ్యాశాస్త్రాన్ని
అనుసరిస్తూ ఉండటం సహజం. అదృష్టం కలిసొస్తుందనీ ... కాలం అనుకూలమౌతుందనే
నమ్మకంతో వీటిని పాటిస్తుంటారు. ఇప్పుడదే తరహాలో కల్యాణి మాలిక్ తన పేరును
కల్యాణిగా మార్చుకుని ఉంటాడని భావిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)