ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అభినయానికి చిరునామా సుహాసిని

Wed, Aug 15, 2012
సుహాసిని
సుహాసిని
     మనోహరమైన దరహాసంతో అశేష ప్రేక్షకులను
ఆకట్టుకున్న అందమైన కథానాయిక సుహాసిని. తెలుగు తెరపై విరబూసిన విరజాజిలా
కనిపించే సుహాసిని, 1982 లో 'మంచుపల్లకి' చిత్రంతో తెలుగు తెరకి
పరిచయమైంది. చిరంజీవి వంటి అగ్ర కథానాయకుడితో కెరియర్ ను ప్రారంభించిన ఆమె
ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆయనతోనే 'ఛాలెంజ్' ... 'చంటబ్బాయ్' వంటి సూపర్
హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక బాలకృష్ణ తో 'మంగమ్మగారి మనవడు'
... వెంకటేష్ తో 'వారసుడొచ్చాడు' ... 'నాగార్జునతో చేసిన 'ఆఖరి పోరాటం'
వంటి చిత్రాలు విజయాలను సాధించాయి.

    ఇక అప్పట్లో సీనియర్ కథానాయకులుగా
వెలుగొందుతోన్న కృష్ణ - శోభన్ బాబుతో ఆమె జట్టు కట్టిన ప్రతి చిత్రం మహిళా
ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా శోభన్ బాబు సరసన ఆమె
నటించిన 'శ్రావణ సంధ్య' ... 'మహారాజు' ... 'ఇల్లాలు ప్రియురాలు'
వంటి చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు.

    ఇక
'ముక్కుపుడక' ... 'మమతల కోవెల' ... 'సిరివెన్నెల' ... 'సింధుభైరవి' వంటి
చిత్రాలు సుహాసిని నటనలోని కొత్త కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించాయి. ఇదే
ఆదరణ ఆమెకి తమిళ సినీ పరిశ్రమలోనూ దక్కడాన్నివిశేషంగా చెప్పుకోవాలి.
భారతీయ సినిమాపై దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన మణిరత్నాన్ని వివాహమాడిన
ఆమె, ఆ తరువాత ఇటు తెలుగులోనూ ... అటు తమిళంలోను ప్రాధాన్యత గల పాత్రలను
పోషిస్తూ వస్తోంది. ఈ రోజు సుహాసిని పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకి
శుభాకాంక్షలు తెలియజేస్తోంది ap7am.com
X

Feedback Form

Your IP address: 54.211.11.50
Movie News (Latest)