ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జీవాను చూసి షాక్ అవుతున్న హీరోలు

Tue, Aug 07, 2012
జీవా
జీవా
      జీవా ... ఈ పేరు వినగానే
'రంగం' సినిమా గుర్తుకు వస్తుంది ... అందులో చాకులాంటి కుర్రాడు చేసే
హుషారైన సాహసాల సందడి కళ్లముందు కదలాడుతుంది. తమిళ తెరపై యువ కథానాయకుడిగా
వెలుగొందుతోన్న జీవా, ఇప్పుడు తన కెరియర్ కి సంబంధించిన అడుగులు చాలా
జాగ్రత్తగా వేస్తున్నాడు. ఓ వైపున విక్రమ్ ... అజిత్ ... విజయ్ ... సూర్య 
వంటి సీనియర్ కథానాయకుల పోటీని ... మరో వైపున కార్తి ... విశాల్ ... వంటి
తన తోటి హీరోల పోటీని అతను తట్టుకోవలసి ఉంది.

       ఈ నేపథ్యంలో జీవా తన
ప్రత్యేకతను చాటుకుని, తనని తాను నిరూపించుకోవలసిన అవసరం ఏర్పడింది. దాంతో
ఇప్పుడతను రొటీన్ చిత్రాలకి భిన్నంగా ప్రేక్షకుల ముందుకి రావడానికి తన వంతు
కృషి చేస్తున్నాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే జీవా 'ముగమూడి' అనే తమిళ
చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమా 'మాస్క్' పేరుతో ప్రేక్షకుల
ముందుకి రానుంది. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో
జీవా సూపర్ హీరోగా కనిపించనున్నాడు. ఈ సినిమాపై పెరుగుతోన్న అంచనాలు
అక్కడి అగ్ర కథానాయకులని సైతం ఆలోచింపజేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా కనువిందు చేయనున్న ఈ సినిమా ఈ నెల 12 న ఆడియో విడుదల జరుపుకుని, 31 న ప్రేక్షకుల ముందుకి రానుంది.
X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)