ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విలన్ గా బిజీ అవుతోన్న సుదీప్

Tue, Aug 07, 2012
సుదీప్
సుదీప్
     ఇప్పుడంతా సుదీప్ హవా నడుస్తోంది ...
'ఈగ' సినిమాలో విలన్ గా ఆయన చేసిన హడావిడి ప్రేక్షకులకి విపరీతంగా
నచ్చేసింది. ఇటు తెలుగులోనూ ... అటు తమిళంలోనూ ఆయనకి పొలోమంటూ ఫాలోయింగ్
పెరిగిపోయింది. దాంతో ఈ రెండు భాషలకి చెందిన యువ కథానాయకులు తమ సినిమాలో
విలన్ గా సుదీప్ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట.
అయితే ఆల్రెడీ కన్నడలో హీరోగా - దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్న
సుదీప్, వైవిధ్యం కోసం ఇతర భాషల్లో విలన్ గా నటించడానికి
అంగీకరిస్తున్నాడు.

    ఈ నేపథ్యంలో తమిళంలో యువ కథానాయకుడిగా ముందువరుసలో ఉన్న
విజయ్ సినిమాలో విలన్ గా సుదీప్ ను ఎంపిక చేశారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం
వహిస్తోన్న 'యోహాన్ అధ్యాయం ఒండ్రు' అనే సినిమాలో ఆయన ప్రతినాయకుడిగా
కనిపించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన సమీరా రెడ్డి కథానాయికగా
అలరించనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. 
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)