ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జగ్గయ్యని కంగు తినిపించిన సావిత్రి

Thu, Jul 26, 2012
సావిత్రి
సావిత్రి
      సావిత్రి సినిమాల్లోకి రావడానికి ముందే
ఆమెతో జగ్గయ్యకి మంచి పరిచయముంది. ఎలాగంటే ... సినిమాల్లోకి రావడానికి
ముందు సావిత్రి నాటకాల ట్రూపులో చేరి ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చేది.
అలా నృత్య ప్రదర్శనలు ఇస్తోన్న సావిత్రిని తన నాటక సమాజానికి తీసుకువచ్చి
నాటికలు వేయించేవారు జగ్గయ్య. ఆ సమయంలోనే వాళ్లిద్దరి మధ్య చనువుగా
పిలుచుకునే అభిమానం ఏర్పడింది. ఆ తరువాత సావిత్రి సినిమాల్లో అవకాశాల కోసం
ప్రయత్నించడం మొదలు పెట్టింది. 'పాతాళభైరవి' చిత్రంలో ఓ పాటలో డాన్స్ కూడా
చేసింది. అయినా చెప్పుకోదగిన వేషాలు మాత్రం రావడంలేదు.

      ఈ నేపథ్యంలోనే
'ప్రియురాలు' చిత్రం షూటింగ్ లాంఛనంగా మొదలైంది. ముహూర్తం సమయానికి
సావిత్రి అక్కడికి చేరుకుంది. తనకి ఆ సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పిన
దోనేపూడి కృష్ణమూర్తి కోసం ఆమె ఆతృతగా ఎదురు చూస్తోంది. అసలు అతనికి తాను
గుర్తున్నానో లేదో అనేదే ఆమె టెన్షన్. అదే సమయంలో ఆమెకి అక్కడ జగ్గయ్య
కనిపించడంతో ప్రాణం లేచొచ్చినట్టు అయింది. జగ్గయ్య కూడా ఆమెని చూడగానే
దగ్గరకి వచ్చి ఆత్మీయంగా పలకరించాడు. ఆ సినిమాలో హీరో అతనేననీ ... దోనేపూడి
కృష్ణమూర్తి వాళ్లు ఆయనకి బాగా పరిచయమని తెలిసి ఆశ్చర్యపోయింది.

     దాంతో, ఎలాగైనా
సరే తనకి ఆ సినిమాలో చాన్స్ ఇప్పించమంటూ జగ్గయ్యని బతిమాలింది. దాంతో ఆయన ఈ

విషయమై దర్శక నిర్మాతలతో మాట్లాడేందుకు ఆఫీసు రూం వైపు వెళ్లారు. అయితే,
అప్పటికే సావిత్రిని తీసుకున్నామని వాళ్లు చెప్పడంతో జగ్గయ్య కంగు
తిన్నారు.
సావిత్రి తనని ఆటపట్టించడానికే అలా చేసిందనుకుంటూ, అక్కడి నుంచి బయటికి
వచ్చారు జగ్గయ్య. ఇదే విషయం సావిత్రి వద్ద ఆయన కాస్త నిష్టూరంగానే అన్నారు.
అయితే, తనని వాళ్లు సెలెక్ట్ చేసిన విషయం తనకింకా తెలియదని సావిత్రి
ఒట్టేసి చెప్పడంతో జగ్గయ్య కూల్ అయ్యారు. తర్వాత ఆ సినిమా హిట్ చేసి, తన
కెరియర్ ఓ గాడిలో పడేలా చూడమని ఆమె కోరిందట.
ఆమెకి ఎవరి సిఫార్సులు అవసరంలేదనీ ... ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని  
 ధైర్యం చెప్పారు జగ్గయ్య. ఆయన చెప్పిందే ఆ తరువాత అక్షరాల నిజమైంది!  
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)