ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అల్లు అరవింద్ ముందుచూపు

Fri, Jul 20, 2012
అల్లు అరవింద్ ఏ విషయంలోనైనా ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తాడనే సంగతి అందరికీ తెలిసిందే. సుధీర్గ కాలంపాటు ఆయన అగ్ర నిర్మాతగా నిలదొక్కుకోవడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు కూడా ఆయన తన సహజమైన ధోరణిలోనే 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి సంబంధించిన నైజాం ఏరియా హక్కులను దక్కించుకున్నారు.గతంలో పవన్ కళ్యాన్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం అక్కడ 20 కోట్లకి పైగా వసూళ్లను చవి చూసింది. దాంతో ఈ సారి ఆయన ముందుచూపుతో ఆ ఏరియా హక్కులను చాలా పకడ్బందీగా తన సొంతం చేసుకున్నారు. ఇందు కోసం ఆయన భారీ మొత్తంలో చెల్లించుకున్నట్టు చెబుతున్నారు. 'బిజినెస్ మేన్' వంటి సూపర్ హిట్ ఇచ్చిన పూరీ ... కళ్ళు చెదిరే  గ్లామర్ తో 'రచ్చ' చేసిన తమన్నా ... 'గబ్బర్ సింగ్' సంచలన విజయంతో ఉన్న పవన్ ... ఈ సినిమాకి అఖండ విజయాన్ని అందిస్తారని భావించే అల్లు అరవింద్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. మరి ఆయన ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి. 
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)