ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సౌందర్య జయంతి నేడు

Wed, Jul 18, 2012
సౌందర్య
సౌందర్య
       సౌందర్య ... పేరుకు తగిన రూపం ... అంతకు మించిన
అభినయంతో ఆమె అశేష ప్రేక్షకులని ఆకట్టుకుంది. చెరగని చిరునవ్వుతో ...
చెదిరిపోని అభినయంతో అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిన సౌందర్య, 1972 జూలై
18 న కర్ణాటకలో సత్యనారాయణన్ దంపతులకి జన్మించింది. MBBS మొదటి సంవత్సరం
చదువుతుండగా ఆమెకి సినిమాల్లో అవకాశం వచ్చింది. తండ్రి కన్నడ సినిమా
నిర్మాత - రచయితగా పేరున్నవాడు కావడంతో ఆమె ఎంట్రీ కన్నడ సినిమా ద్వారానే
జరిగింది.

      అటు మొదలు ఆమె తెలుగు ... తమిళ ... హిందీ చిత్రాలలో సైతం అగ్ర
కథా నాయకులతో నటిస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంది. ఇక 'మనవరాలి పెళ్లి'
చిత్రం ద్వారా తెలుగునాట అడుగు పెట్టిన ఆమె, తెలుగు తెరని మరింత
సౌందర్యవంతం చేసింది. 'చూడాలని ఉంది' ... పవిత్ర బంధం' ... 'హలో బ్రదర్'
... 'పెదరాయుడు' ... 'శ్రీమంజునాథ' ... 'మాయలోడు' ... 'దొంగాట' వంటి
చిత్రాలతో ఆమె అఖండ విజయాలను తన ఖాతాలో జమ చేసుకుంది. ముఖ్యంగా 'అమ్మోరు'
... 'అంతః పురం' ... '9 నెలలు' వంటి చిత్రాలు సౌందర్య అసమాన నటనకి
అద్దం పట్టాయి.

      ఇక కన్నడలో ఆమె స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన 'ద్వీప' చిత్రం
ఆమె ఉత్తమాభిరుచికి ... అభినయ పటిమకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
సావిత్రి ... జయసుధ తరువాత ఆ స్థాయి నటనని ప్రదర్శించగల ప్రతిభ ఒక్క
సౌందర్యకి మాత్రమే సాధ్యమని ఇటు పరిశ్రమ ... అటు ప్రేక్షకలోకం కూడా
గుర్తించాయి. అలాంటి అభినయ సౌందర్యం అనుకోకుండా జరిగిన ప్రమాదంలో
అనంతలోకాలకు తరలిపోయింది. అయితే నవరసాల్లో నాజూకుగా ఇమిడిపోయిన ఆమె నట
సౌందర్యం ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ప్రతి పాత్రలోనూ
పాలలో పంచదారలా కలిసిపోయిన ఆ నట జలపాతం జయంతి నేడు. ఈ సందర్భంగా తెలుగు
తెరపై ఆమె వెదజల్లిన పాత్రల పరిమళాలను ఆస్వాదిస్తూ ... ఆమెను మనసారా
స్మరించుకుందాం. 
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)