ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కష్టాల్లోనూ సాయమందించిన సావిత్రి

Tue, Jul 17, 2012
సావిత్రి
సావిత్రి
         మితిమీరిన
మంచితనం కారణంగా ... చేతికి దొరికినంత దానం చేయడం వల్ల, సావిత్రి కష్టాల్లో
పడిందని, ఆమె గురించి బాగా తెలిసిన వాళ్లు  చెబుతుంటారు. ఓ వైపున కుటుంబ జీవితంలో సమస్యలు ...
మరో వైపున సినిమాల్లో అవకాశాలు తగ్గడం సావిత్రిని కుంగదీశాయి. ఒకవేళ ఏదన్నా
వేషం వుందన్నా... ఆమె నటించగలిగే పరిస్థితుల్లో వుండేది కాదు. ఎందుకంటే బాధలను
మరిచిపోవడం కోసం మత్తు పానీయాలకు ఆమె బానిసైపోయింది. అన్నీ కోల్పోయి
ఒంటరిగా మిగిలిన ఆమె దగ్గరకి ఓ రోజున ఓ అమ్మాయి వచ్చి తనకి తానుగా సావిత్రిని
పరిచయం చేసుకుంది. ఆ అమ్మాయి గతంలో తన కారు డ్రైవర్ కూతురనీ ... తన నుంచి
ఆర్ధిక సాయాన్ని ఆశించి వచ్చిందనే విషయం సావిత్రికి అర్ధమైంది.

        బహుశా తన
పరిస్థితి బాగుండలేదనే సంగతి ఆ అమ్మాయికి తెలిసుండదు ... తెలిస్తే అడిగేది
కాదని సావిత్రి సరిపెట్టుకుంది. ఆ అమ్మాయిని హాల్లోనే కూర్చుండబెట్టి, ఇంటి
వెనుక గుమ్మంలో నుంచి వెళ్లి, తెలిసిన ఓ ఆటో డ్రైవర్ చేతికి తన పట్టుచీర ఇచ్చి, అమ్ముకుని రమ్మంది.
పాతిక వేల రూపాయల ఖరీదు చేసే ఆ చీరను అతను ఐదు వేల రూపాయలకు అమ్మేసి ఆ
డబ్బుతెచ్చి సావిత్రికి అంతే సీక్రెట్ గా ఇచ్చాడు. ఆ డబ్బుని ఆ అమ్మాయికి
ఇచ్చి ఆనందంగా పంపించింది సావిత్రి. అసలా చీరనే ఆ అమ్మాయికి ఇచ్చేద్దామని
సావిత్రి అనుకుందట. కానీ, ఆ అమ్మాయికి ప్రస్తుతం డబ్బు అవసరమని తెలుసుకుని,
తను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆ కంచిపట్టు చీరను అలా సెకండ్ హ్యాండ్ బట్టల
దుకాణంలో అమ్మించి, ఆ డబ్బుని ఆ అమ్మాయికి ఇచ్చేసిన త్యాగం ఒక్క సావిత్రి
కాక మరెవరు చేయగలరు?
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)