ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తల్లిని ప్రమోట్ చేస్తున్న కథానాయిక

Thu, Jun 14, 2012
రాధ-కార్తీక
రాధ-కార్తీక
          ఒకప్పటి అందాలతార రాధ తన కూతురు కార్తీకని నిన్నటి వరకు ప్రమోట్
చేస్తే... ఇప్పుడు వాళ్ళమ్మను ప్రమోట్ చేసే బాధ్యతను కార్తీక తీసుకుంది.
అవును... తన తల్లి ఫలానా పాత్రకి బాగా సూట్ అవుతుందని ఈ అమ్మడు అంటోంది.
'మా అమ్మ గుండమ్మ పాత్రకు సరిగ్గా సరిపోతుంది. ఒక్కసారి ఆ పాత్రలో మా
అమ్మను మీరు ఊహించుకుని చూడండి... మీరు కూడా నా మాటను సమర్ధిస్తారు'
అంటోంది కార్తీక.

          'గుండమ్మ కథ' సినిమాను యన్టీఆర్, నాగచైతన్యలతో రీమేక్ చేయడానికి
సన్నాహాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో కార్తీక ఇలా తల్లి
పేరును తెరపైకి తెచ్చింది. ఆ సినిమా అంటే తనకెంతో ఇష్టమనీ, దానిని చాలా
సార్లు చూశాననీ కార్తీక చెబుతోంది. తన తల్లికి గుండమ్మ పాత్ర ఇస్తే, తను
జమున పాత్ర అడగచ్చన్నది కార్తీక ప్లాన్ అయివుంటుందని... కార్తీక మీద
అప్పుడే జోకులు కూడా మొదలయ్యాయి!        
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)