ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డ్రీమ్ గాళ్ ఇంట తొలి పండుగ!

Mon, Jun 11, 2012
ఇషా డియోల్
ఇషా డియోల్
        ఒకప్పటి డ్రీం గాళ్ హేమమాలిని ఇంట ఇప్పుడు పెళ్లి సందడి మొదలైంది.
ఆమె కూతురు ఇషా డియోల్ వివాహం ఈ నెల 29 న భరత్ తక్తానితో జరుగుతోంది. ఇది
హేమ-ధర్మేంద్రల ఇంట తొలి శుభకార్యం అయినప్పటికీ, ఈ వేడుకను మాత్రం ముంబాయ్
శివారులోని ఓ దేవాలయంలో నిర్వహిస్తున్నారు. 'ఇది మా రెండు కుటుంబాలకు
చెందిన వ్యక్తిగతమైన వ్యవహారం కాబట్టి, పెళ్ళికి పెద్దగా గెస్ట్ లు ఎవర్నీ
పిలవడం లేదు. కేవలం రెండు కుటుంబాల ముఖ్యులూ హాజరవుతారు. ఆ మర్నాడు మాత్రం
స్టార్ హోటల్ లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాం. మేమిద్దరం కేవలం
ఆర్టిస్టులమే కాదు. రాజకీయాల్లో కూడా వున్నాం కాబట్టి, రెండు రంగాలకు
చెందిన వాళ్ళూ వస్తారు. రిసెప్షన్ కాస్త భారీగానే వుంటుంది లెండి' అంటోంది
హేమమాలిని.

        అప్పట్లో తన పెళ్లి పెద్ద సందడి లేకుండా జరిగిపోయిందనీ, అందుకే తన
కూతురు వివాహాన్ని కాస్త హడావిడితో చేయాలని ప్లాన్ చేశాననీ హేమా మేడం
చెబుతోంది. 31 ఏళ్ల ఇషా డియోల్ హేమ-ధర్మేంద్రల పెద్ద కూతురు! 
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)