ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ముందడుగు' అంటే ఇదా?

Sat, Jun 09, 2012
రామానాయుడు
రామానాయుడు
         రామానాయుడు ఎంత గొప్ప నిర్మాత
అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఆయన కృష్ణ -
శోభన్ బాబుతో ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేసినపుడు ఓ తమాషా
సంఘటన జరిగింది. కె.బాపయ్య ని దర్శకుడిగా నియమించబడిన ఈ సినిమాకి, నటీనటుల ఎంపిక
కూడా జరిగి పోయింది. ఎవరెవరు ఏ తారీఖున షూటింగ్ కి హాజరుకావాలనే డేట్స్
కూడా ఆర్టిస్టులకి ఇచ్చేశారట. ఈ సినిమాలో రావి కొండలరావుకి  కూడా ఓ
పాత్ర దక్కింది.

        ఆయన తనకిచ్చిన  డేట్స్ లిస్టు తీసుకుని నేరుగా రామానాయుడు
దగ్గరకి వెళ్లారు. ఆ సినిమాలో తనకి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు
తెలియజేసి, తనకి అడ్వాన్స్ గా కొంత డబ్బుని ఇప్పించవలసిందిగా కోరారు. అదే
మొదటి సారైనట్టు ఆయనలా కొత్తగా అడ్వాన్స్ అడగడం చూసి రామానాయుడు
ఆశ్చర్యపోతూ, తన సంస్థ పాటించే పద్ధతిని గురించి ప్రస్తావిచడంతో, ''నేను
కావాలని అడగలేదు సార్ ... మీరే గదా 'ముందడుగు' అన్నారు''  అంటూ అమాయకంగా
ముఖం పెట్టాడట. దాంతో అసలు సంగతి అర్ధమైపోయి రామానాయుడు హాయిగా నవ్వేశారట.
ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే ... రామానాయుడు తీసిన ఆ సినిమా పేరు
'ముందడుగు'... అదీ సంగతి!  
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)