ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రముఖ దర్శకుడు కె.యస్.ఆర్.దాస్ మృతి

Fri, Jun 08, 2012
కె.యస్.ఆర్.దాస్
కె.యస్.ఆర్.దాస్
          తెలుగులో యాక్షన్ చిత్రాలకు శ్రీకారం చుట్టిన ప్రముఖ దర్శకుడు
కె.యస్.ఆర్.దాస్ ఈ రోజు చెన్నయ్ లోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. గత కొంత
కాలంగా అనారోగ్యంతో వున్న ఆయన కొద్ది క్షణాల క్రితం తుది శ్వాస వదిలారు.
1936 లో నెల్లూరులో జన్మించిన దాస్ తొలి చిత్రం 'లోగుట్టు
పెరుమాళ్ళకెరుక'. 1966 లో వచ్చిన ఈ చిత్రంలో శోభన్ బాబు, రాజశ్రీ జంటగా
నటించారు. సుమారు వంద చిత్రాలకు దర్శకత్వం వహించిన దాస్, సూపర్ స్టార్
కృష్ణతో అత్యధిక మొత్తంలో 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీరి
కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం 'టక్కరి దొంగ చక్కని చుక్క'.

        తర్వాత ఆయన కృష్ణతో తీసిన 'మోసగాళ్ళకు మోసగాడు' భారత సినీ
చరిత్రలో ఓ ట్రెండ్ సెట్టర్ అయింది. 'అన్నదమ్ముల సవాల్' చిత్రం ద్వారా
రజనీకాంత్ కు మాస్ హీరోగా ఆయన ఎనలేని ఇమేజ్ ను తెచ్చిపెట్టారు. యన్టీఆర్,
కాంతారావు, చిరంజీవి, విష్ణువర్ధన్ వంటి హీరోలతో కూడా పలు చిత్రాలను
రూపొందించారాయన. సినిమా రంగంలో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారాయన.

       ఫైట్లు అంటే ఇవే... యాక్షన్ అంటే ఇదే...  అని ఒక ఒరవడిలో
వెళుతున్న తెలుగు చిత్ర సీమ గమనాన్ని ఆయన తన చిత్రాలతో మార్చేశారు. యాక్షన్
చిత్రాల నిర్మాణంలో తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించారు. ముఖ్యంగా
హీరో కృష్ణకు మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టడంలో దాస్ చిత్రాలు ఎంతో
ఉపయోగపడ్డాయనే చెప్పాలి. మాస్ ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడిగా ఆయన పేరు
తెచ్చుకున్నారు. B, C సెంటర్లలో ఆయన చిత్రాలు కనక వర్షం కురిపించేవి.
అలాగే అనుబంధాలు, ఆప్యాయతలతో కూడిన సెంటిమెంటు కథా చిత్రాలను కూడా ఆయన
అద్భుతంగా తెరకెక్కించారు. నేటి మన యాక్షన్, మాస్ చిత్రాల దర్శకులపై ఆయన
ప్రభావం ఎంతో వుందనడంలో అతిశయోక్తి లేదు! 
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)