ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రామానాయుడుకి అభిమాని కానుక!

Thu, Jun 07, 2012
         తమకి ఇష్టమైన వారి పట్ల తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా
వ్యక్తపరుస్తుంటారు. ఇప్పుడు కూడా బాలరాజు అనే ఓ అభిమాని సురేష్
ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడి పట్ల తన అభిమానాన్ని వినూత్నంగా
ప్రదర్శించాడు. రామానాయుడు సినీపరిశ్రమకు వచ్చి ఏభై ఏళ్ళు పూర్తయిన
సందర్భంగా ... రామానాయుడు నిర్మించిన చిత్రాల టైటిల్ లోగోలను సేకరించి ఒక
చోట పేర్చి, సైకిల్ పై వెళుతున్న రామానాయుడి అరుదైన ఫోటోను దానికి అందంగా
జత చేసి, ఫ్రేం కట్టి మరీ ఆయనకు కానుకగా ఇచ్చాడు. అది చూసిన నాయుడుగారు ఆ
అభిమాని కానుకకి మురిసిపోయారు. తన స్టూడియోకు వస్తున్న ప్రతి వారికీ ఆ
ఫ్రేం కట్టిన ఫోటో చూపిస్తూ ఆనందపడిపోతున్నారు. తన మనసుకు నచ్చిన ఈ ఫోటోని
విశాఖలో తన స్టూడియోలో పెడతానని ఆయన మీడియాకు తెలిపారు. అన్నట్టు, ఈ
అభిమాని నిర్మాతగా కూడా అవతారం ఎత్తుతున్నాడు!   
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)