ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రామానాయుడు పుట్టినరోజు నేడు !

Wed, Jun 06, 2012
దగ్గుబాటి రామానాయుడు ... ఈ పేరు ప్రస్తావించకుండా తెలుగు సినిమా చరిత్రని చెప్పుకోవడం చాలా కష్టం. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రని పరిశీలిస్తే ఆయన నిర్మించిన అపురూప చిత్రాలు ... అవి సాధించిన అఖండ విజయాలు ప్రతి పేజీలోను మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. ప్రకాశం జిల్లా కారంచెడు గ్రామానికి చెందిన రామానాయుడు, సినిమా రంగం పట్లవున్న ఆసక్తితో మద్రాసు చేరుకొని నిర్మాణం దిశగా అడుగులు వేశారు. 1963 లో  'అనురాగం' అనే చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి నిర్మాతగా పరిచయమైన రామానాయుడు, తన రెండవ సినిమాగా ఎన్టీఆర్ తో 'రాముడు - భీముడు' చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత అక్కినేనికి 'ప్రేమ్ నగర్' ... శోభన్ బాబు కి 'సోగ్గాడు' కృష్ణకి 'సావాసగాళ్లు' వంటి తిరుగులేని విజయాలను అందించారు. ముఖ్యంగా ఆయన శోభన్ బాబు - కృష్ణ తో 'మండే గుండెలు' ... 'ముందడుగు' వంటి మల్టీ స్టారర్ చిత్రాలకి సైతం శ్రీకారం చుట్టారు. కాంతారావు ...  జగ్గయ్య ... కృష్ణంరాజు వంటి కథానాయకులతో పాటు, ఆ కాలం నాటి అందరు కథానాయికలకి అవకాశం కల్పించారు. ఇక ఆ తరువాత తరం వారైన చిరంజీవి ... బాలకృష్ణ ... నాగార్జున ... వెంకటేష్ లతో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుంచారు. ఈ తరం యువ కథానాయకులతో కూడా ఆయన తన సొంత బ్యానర్ పై చిత్రాలను నిర్మిస్తూనే వున్నారు. తెలుగు - తమిళ - మలయాళ -  కన్నడ - బెంగాలి - హిందీ ... ఇలా  ప్రస్తుతం నిర్మిస్తోన్నపంజాబీ చిత్రంతో కలిపి దాదాపు అన్ని భాషలలోను సినిమాలను నిర్మించిన ఘనత ఆయన సొంతం. నిర్మాత ఎలా వుండాలి అనే ప్రశ్నకి అందరూ కలిసికట్టుగా చెప్పే సమాధానంగా ఎదగడానికి కారణం ఆయన కృషి  ... పట్టుదల . ఇంతవరకూ 130 సినిమాలకి పైన నిర్మించి సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న  ఈ మూవీ మొఘల్ ని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని సైతం అలంకరించింది. విజయాలకి పొంగి పోకుండా ... పరాజయాలకి కుంగి పోకుండా పద్ధతి ప్రకారం నడుచుకోవడమే తన సక్సెస్ సీక్రెట్ అని చెబుతున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తోంది  ap7am.com
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)