ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వర్మ కోసం అంతా రెడీగా వున్నారు!

Fri, Jan 28, 2011


        ఈమధ్య ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీసు దగ్గర ఎలా పేలిపోయాయో మనకు తెలుసు. ఫ్లాపు ఇవ్వడంలో ఒక దానిని మించి మరొకటి పోటీపడ్డాయి కూడా! నాగవల్లి, రగడ, పరమ వీర చక్ర, అనగనగా ఓ ధీరుడు, తాజాగా 'వాంటెడ్' చిత్రాల గురించి టాలీవుడ్ ఎంతగానో ఎదురుచూసింది. అయితే, ఎలా వచ్చాయో అలాగే చడీచప్పుడూ లేకుండా ఆయా సినిమాలు వచ్చిన దారినే వెళ్ళిపోయాయి. ఇప్పుడిక రాంగోపాల్ వర్మ తీసిన 'K .S .D . అప్పల్రాజు' మిగిలివుంది. ఫిబ్రవరి 4 న రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం టాలీవుడ్ లోని అన్ని వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇది టాలీవుడ్ మీద ఫుల్ సెటైర్ కాబట్టి, వర్మ ఎవరెవర్ని ఈ సినిమాలో బాదేసాడో చూడాలన్న తహతహతో ఉన్నారంతా.  ఎవరెవరి మీద సెటైర్లు వేసాడన్నది ఇప్పటికే చూచాయగా తెలిసినా, సినిమా చూసి కన్ఫర్మ్ చేసుకోవడానికి అంతా రెడీగా వున్నారు. అలాగే, సినిమా ఏమాత్రం బాగోకపోయినా క్షణాలలో మోసేయడానికి కూడా చాలా మంది రెడీగానే వున్నారు! 
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)