ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'విశ్వరూపం'తో అలసిపోయిన కమల్ !

Thu, May 17, 2012
కమల్ హాసన్ నట 'విశ్వరూపం' కోసం తెలుగు - తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని ఓ యజ్ఞం లా భావించి కమల్ హాసన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ... భారీ తారాగణంతో కమల్ తెర కెక్కిస్తోన్న ఈ సినిమా పలు భాషల్లో విడుదల కాబోతోంది. 'అంతర్జాతీయ తీవ్రవాదం ... అది మానవాళి మనుగడపై చూపించే ప్రభావం' కథా వస్తువుగా చేసుకుని కమల్ ఈ సినిమాని దర్శక నిర్మాతగా రూపొందిస్తున్నారు. దాదాపు ఏడాది పాటు కొనసాగిన షూటింగ్ చివరి దశకి చేరుకున్నట్లు తెలుస్తోంది. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని, జూన్ 29 న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. భారీ ప్రాజెక్ట్  పెట్టుకుని ... దర్శక నిర్మాత బాధ్యతని భుజాన వేసుకుని కమల్ చాలా అలసిపోయాడనే వార్తలు కోలీవుడ్ సినీవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమా తరువాత టెన్షన్స్ అన్ని పక్కనపెట్టి ఓ పూర్తి వినోదాత్మక చిత్రంలో నటించేందుకు కమల్ ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు. పోతే 'దశావతారం' తో ఓ ప్రయోగాన్ని చేసిన కమల్,  'విశ్వరూపం' తో ఎంతవరకు ప్రయోజనాన్ని సాధిస్తాడనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నీయంశమైంది.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)