ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ ముగ్గురితో రామానాయుడు సినిమా !

Wed, May 16, 2012
రామానాయుడు
రామానాయుడు
        తెలుగు తెరకి భారీ చిత్రాలను
... భారీ విజయాలను పరిచయం చేసిన రామానాయుడుకి ఓ కోరిక వుంది. వెంకటేష్ - రానా - నాగ
చైతన్యలతో ఓ సినిమా రూపొందించాలన్నది ఆయన అభిలాష. ఈ ముగ్గురి ఇమేజ్ కి
తగిన కథల కోసం అన్వేషిస్తున్నామని ఆయన అంటున్నారు. ఈ కథ ఎలా వుండాలనేది చిత్ర
పరిశ్రమకి చెందిన ప్రముఖ రచయితలతో పాటు, తన ఫిల్మ్ ఇనిస్టీట్యూట్ కి
సబంధించిన స్టూడెంట్స్ కి కూడా సూచించానని రామానాయుడు చెప్పారు. అన్ని
విధాలుగా కథ కుదిరితే వెంటనే ప్రొడక్షన్ ని ప్రారంభిస్తామని అన్నారు.

        ప్రస్తుతం ఆయన పంజాబీలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ 5 న
కెనడాలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక రామానాయుడు ఫ్యామిలీకి
సంబంధించిన సినిమా సంగతి అలా ఉంచితే, ఎ.ఎన్.ఆర్. - నాగార్జున - నాగ చైతన్య
ప్రధాన పాత్రల్లో విక్రం కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్నట్టు ఆమధ్య
అధికారిక ప్రకటనే వచ్చింది. ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళితే, ఈ రెండు
కుటుంబాలకి సంబంధించిన చిత్రాల్లో నటించిన వాడిగా నాగ చైతన్యకి ఓ అరుదైన
ఘనత దక్కడం ఖాయమని సినీవర్గాలు భావిస్తున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)