ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమీర్ ఖాన్ 'సత్యమేవ జయతే'

Fri, May 04, 2012
అమీర్ ఖాన్
అమీర్ ఖాన్
        
బాలీవుడ్ తెరపై  అగ్ర కథానాయకులుగా వెలుగొందుతోన్న షారూఖ్ ఖాన్ ... సల్మాన్
ఖాన్ ... అమీర్ ఖాన్ లలో, ఇప్పటికే సల్మాన్ - షారూఖ్ లు బుల్లి తెర
వైభవంలో పాలు పంచుకుంటున్నారు. తాను చేసే ప్రతి పనిలో వైవిధ్యం వుండాలని
ఆలోచించే అమీర్ ఖాన్ కూడా, బుల్లి తెరపై తనదైన ముద్ర వేయడానికి
సిద్ధమైపోయారు. ఇందుకుగాను ఆయన 'సత్యమేవ జయతే' అనే విభిన్నమైన
కార్యక్రమాన్ని రూపొందించారు. అమీర్ ఖాన్ స్కూల్ మేట్ సత్యజిత్ దర్శకుడిగా
వ్యవహరిస్తోన్నఈ కార్యక్రమాన్ని, 100 కి పైగా దేశాల్లో ... 8 భాషల్లో ఒకేసారి
ప్రసారం చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

        దక్షిణాదికి సంబంధించి తెలుగు -
తమిళ - మలయాళ భాషల్లోకి ఈ కార్యక్రమాన్ని అనువదిస్తుండగా, తెలుగులో ఈ
కార్యక్రమాన్నిఈటీవీ ప్రసారం చేయనుంది. ఈ నెల 6 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే
ఈ కార్యక్రమం, దూరదర్శన్ సహా వివిధ చానెళ్లలో 13 వారాలపాటు ప్రతి ఆదివారం
ఉదయం 11 గంటలకి ప్రసారమౌతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన టైటిల్ సాంగుని
3 భాషల్లో చిత్రీకరించారట. కొంత భాగాన్ని కొచ్చిలోను ... మరి కొంత
భాగాన్ని ఆంద్రప్రదేశ్ లోని మారుమూల పల్లెటూళ్లో చిత్రీకరించినట్టు
చెబుతున్నారు. ఇక ఇది ఏ తరహా కార్యక్రమమనేది చెప్పకుండా అమీర్ ఖాన్ 
సస్పెన్స్ లో ఉంచుతున్నారు. ఈ కార్యక్రమం కాన్సెప్ట్ ఏంటో ... కంటెంట్ ఏంటో
వెల్లడికాకపోవడం అందరిలోనూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది!
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)