ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రద్ధాదాస్ తెలివిగా తప్పుకుందట !

Wed, Apr 11, 2012
తారకరత్న హీరోగా వీరు .కె దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోందనే విషయం
తెలిసిందే. శ్రద్ధా దాస్ ... అర్చన ... కృష్ణుడు ప్రధాన పాత్రలుగా ఈ
సినిమాకి సంబంధించిన షూటింగ్ నిన్ననే లాంఛనంగా ప్రారంభమైంది. ఆర్.ఎ.
ఆర్ట్స్ బ్యానర్ పై జానీ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ మొదలై ఒక రోజు
కూడా కాకముందే, ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్టుగా శ్రద్ధాదాస్
ప్రకటించింది. ఇటు వ్యక్తిగతమైన ... అటు వృత్తిపరమైన కారణాలవల్ల ఈ సినిమా
నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె తన మైక్రో బ్లాగింగ్ సైట్లో వెల్లడించింది. ఈ
సినిమాలో అవకాశం దక్కడంపట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆమె, మరుసటి రోజే
ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇప్పుడిప్పుడే
నిలదొక్కుకుంటోన్న ఆమె, ముందుచూపుతోనే ఇలా చేసిందని పరిశీలకులు
చెబుతున్నారు. హీరోగా తారకరత్న ... దర్శకుడిగా వీరు.కె వరుస పరాజయాలతో
ఉన్నకారణంగానే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తెలివిగా తప్పుకుందని అంటున్నారు.    
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)