ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దర్శకత్వం వైపు అందాలతార అడుగులు

Mon, Apr 09, 2012
        ఆమధ్య వచ్చిన LBW చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన చిన్మయి ఘట్రాజు,
ఇటీవల విడుదలైన 'ఈరోజుల్లో...' చిత్రంలో కామెడీ పాత్ర చేసి ఆకట్టుకుంది.
తాజాగా 'లవ్ లీ' చిత్రం చూసిన వారికి చిన్మయి బాగా
గుర్తుండే వుంటుంది. ఈ సినిమాలో ఆమె వెన్నెల కిషోర్ కి జోడీగా తెలంగాణా
యాసని మాట్లాడుతూ తనదైన శైలిలో వినోదాన్ని పంచింది. సాధారణంగా ఈ మాత్రం
గుర్తింపు ఎవరికొచ్చినా అదే రూట్లో చకచకా అల్లుకుపోతుంటారు. కానీ చిన్మయి
మాత్రం అందుకు భిన్నంగా దర్శకత్వం వైపు అడుగులు వేయాలని చూస్తోంది.

      ముందుగా
సహాయ దర్శకురాలిగా కొంత అనుభవాన్ని సంపాదించుకుని, ఆ తరువాత తనదైన
స్టైల్లో చిత్రాలను తెరకెక్కిస్తానని అంటోంది.  ప్రస్తుతం తాను ఓ సినిమాకి
స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాననీ ... సాధ్యమైనంత త్వరలో దర్శకురాలిగా
ప్రేక్షకుల ముందుకు వస్తానని చెబుతోంది. నటిగా గుర్తింపుతో పాటు అవకాశాలు
కూడా వస్తున్న సమయంలో ఈమె ఇలా ఫీల్డ్ మార్చుకోవడం అంత మంచిది కాదనీ ...
ఇప్పుడు వినిపించుకోకపోతే అనుభవంతో అర్ధం చేసుకోక తప్పదని విమర్శకులు
అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)