ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

టాలీవుడ్ ని టార్గెట్ చేసిన వర్మ 'అప్పల్రాజు'

Fri, Jan 21, 2011




     'ఇక తెలుగు సినిమాలు చేయను' అని చెప్పి టాలీవుడ్ మీద అలిగిన రాంగోపాల్ వర్మ చాలా కాలం గ్యాప్ తర్వాత తీస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా 'కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు'. ఈ సినిమా ప్రకటించిన దగ్గర్నుంచీ ప్రతి దశలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే వుంది. ఫిబ్రవరి 4 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా విశేషాలను ఓసారి పరిశీలిద్దాం.

                              మన టాలీవుడ్ నేపధ్యమే! 

    చిత్రం కధా వస్తువుకి సినిమా నేపధ్యాన్ని ఎంచుకున్నారు వర్మ. ఒక విధంగా చెప్పాలంటే, టాలీవుడ్ లోని లోపాలను, లొసుగులను, దోపిడీని, మోసాలను ఇందులో మనకు వర్మ వినోదాత్మకంగా చూపించనున్నారు. ఇందులోని చాలా పాత్రలు టాలీవుడ్ లోని ఎవరో ఒక ప్రముఖుడిని మనకు గుర్తుకు తెస్తాయి. అలాగే, పలువురిపై వర్మ శైలిలో సెటైర్లు కూడా పడనున్నాయి. అసలు తెలుగు సినిమా రంగంలో 'నన్ను మించిన వాళ్లెవరున్నారు? అంతా కాపీగాళ్ళే' అనుకునే అప్పల్రాజు అనే ఓ అమలాపురం కుర్రాడు దర్శకుడిగా అవతారం ఎత్తడం, వాళ్లని తలదన్నేలా సినిమా తీస్తాననడం దగ్గర్నుంచి ఈ సినిమా ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది వర్మ స్టయిల్ లో మనకు కనపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే, టాలీవుడ్ మీద వర్మకున్న ఒపీనియేన్నే అప్పలరాజు మనస్తత్వం అనుకోవాలి. ఎందుకంటే, వర్మ కూడా ఇక్కడి వాళ్లని ఇప్పటికీ అదే చులకన భావంతో చూస్తారు!

                               వర్మ బూతు సాహిత్యం

   'రక్త చరిత్ర' సినిమాలో ఓ పాట పాడిన వర్మ ఇందులో ఓ పాట రాసారు. 'నీ యమ్మ... ఆ  కళ్ళేన్టే...' అంటూ సాగే ఈపాట వర్మ స్థాయిలో లేదు. ఆ పాటలో వాడిన పదాలు చూస్తే పక్కా బూతు పాటలా అనిపిస్తుంది. స్త్రీ అందాన్ని స్తుతిస్తూ సాగుతుందిది అని వర్మ చెప్పినా, అటువంటి పరిమళం ఇందులో మన నాసికకు తగలదు. ఇంక ఇటువంటి పాటల చిత్రీకరణ ఆయన ఏ స్థాయిలో జరుపుతాడో మనకు తెలిసిందే. ఇదీ అలాగే ఎక్స్ పోజింగ్ తో నింపేశాడు. అసలు అందమైన పాటల చిత్రీకరణకు వర్మ పెట్టింది పేరు. 'క్షణక్షణం' పాటలు చూడండి! అది గతం అనుకోవాలి, ఎందుకంటే, 'రంగీలా' నుంచీ వర్మ మారిపోయాడు. ఇప్పుడిది పరాకాష్ట!

                           బ్రహ్మానందం పాడేసాడు!

   వకాశం ఇవ్వాలే కానీ బ్రహ్మానందం ఏదీ వదులుకోడు. అలాగే, వర్మ అడగ్గానే ఇప్పుడిందులో ఓ పాట కూడా పాడేసాడు. 'నా పేరే శ్రీశైలం... నే చేస్తా రౌడీ ఇజం...' అంటూ ఈ పాట సాగుతుంది. పైగా ఈ పాటలో నటించింది కూడా బ్రహ్మీనే. ఇందులో పెద్ద రౌడీగా పోజిస్తూ ఆయన చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఒక విధంగా బ్రహ్మీని ఇంతకు ముందు 'మనీ' సినిమాలో విలన్ గా మార్చింది వర్మే! ఆ తర్వాత 'అనగనగా ఓ రోజు' సినిమాలో కూడా మరో విలన్ పాత్రను చేయించారు.

                             సునీల్ కెరీర్ ఏమవుతుంది?

   'మర్యాద రామన్న' సినిమాతో రాజమౌళి హాస్యనటుడు సునీల్ కి మంచి ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేసాడు. ఆ వెంటనే వర్మ అతనితో ఈ సినిమా స్టార్ట్ చేసాడు. ఇప్పుడీ సినిమా సక్సెస్ పై సునీల్ హీరోగా కొనసాగడమా? లేక కమెడియన్ గానే కొనసాగడమా? అనేది ఆధారపడివుంది. హిట్టయితే పర్వాలేదు. కానీ ఫట్టయితే మాత్రం మళ్లీ సునీల్ తో హీరోగా చేయడానికి ఇప్పట్లో ఎవరూ సాహసించరు.

                                ప్రమోషన్ అదుర్స్

  సినిమాలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. వీటిని వారానికొకటి చొప్పున రిలీజ్ చేస్తూ వస్తున్నాడు వర్మ. ప్రతిసారి ఆడియో ఫంక్షన్ చేస్తూ సినిమాని వెరైటీగా  ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే, సినిమాలోని క్యారెక్టర్లని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన బ్రోచర్ కి విశేష స్పందన రావడమే కాకుండా టాలీవుడ్ లో అది సంచలనం కూడా అయింది. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4 న విడుదలవుతోంది.



X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)