ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆమె 'కహాని'కి అన్ని కోట్లా ?

Mon, Apr 02, 2012
         విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన 'కహాని' చిత్రం గురించే ఇప్పుడంతా
మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన 17 రోజుల్లోనే 43 కోట్లు వసూలు
చేయడం బాలీవుడ్ ప్రముఖులను సైతం ఆశ్చర్యపరుస్తోందట. సంజయ్ ఘోష్
దర్శకత్వంలో కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, ఈ స్థాయిలో కనకవర్షం
కురిపిస్తుండటాన్నిఅక్కడ చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారని
తెలుస్తోంది.
        ఈ సినిమాకి ముందు విద్య నటించిన 'ది డర్టీ పిక్చర్' దాదాపు
వంద కోట్లను వసూలు చేసింది. అయితే విచ్చలవిడిగా విద్య చేసిన శృంగార
ప్రదర్శన కారణంగానే ఈ సినిమా ఇంతటి సక్సెస్ ని సాధించిందని చాలామంది ఆమెని
విమర్శించారు. అలాంటివారికి 'కహాని' ఘన విజయంతో విద్య సరైన చెప్పిందని ఆమె
సన్నిహితులు అంటున్నారు. ఈ సినిమా చూసిన అమీర్ ఖాన్ విద్య నటనని
అభినందించడమే కాకుండా, ఆమెతో నటించాలని ఉందని చెప్పాడట. అంతకన్నా ఆమెకి
దక్కాల్సిన పురస్కారం ఏముంటుందన్నఅభిప్రాయాన్ని వాళ్లంతా వ్యక్తం
చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)