ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'అజ్ఞాతం'లో కల్యాణి !

Tue, Mar 27, 2012
      
'ఔను వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు' సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న
కథానాయిక కల్యాణి. ఆ తరువాత ఆమె చకచకా చాలా సినిమాలు చేసినప్పటికీ, వాటిలో
ఒకటి రెండు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకి
కాస్త దూరమైన కల్యాణి, అడపాదడపా మాత్రమే తెరపై కనిపిస్తోంది. ఈ
నేపథ్యంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న 'అజ్ఞాతం' అనే చిత్రంలో
ఆమె ప్రధాన పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర
కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని సెన్సార్ కి సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా
చిత్ర దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ ... కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి
సందేశాన్ని అందించే విధంగా ఈ సినిమాని రూపొందించినట్టు చెప్పాడు. అన్ని
వర్గాలను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించిన ఈ సినిమా, త్వరలోనే
ప్రేక్షకుల ముందుకు రానుందని అన్నాడు. శ్రీ కమలాలయ బ్యానర్ పై నిర్మించిన ఈ
సినిమాలో కల్యాణితో పాటు సుబ్బరాజు ... దీప్తీ ప్రియ ... తనికెళ్ల భరణి ...
బెనర్జీ ... కృష్ణ భగవాన్ ... ప్రభాకర్ తదితరులు నటించారు. 
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)