ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆయన కోసం ఎదురుచూస్తున్న ఫంక్షన్!

Sat, Mar 24, 2012
        ఒక అతిధి కోసం ఒక సినిమా ఆడియో వేడుకను నెల రోజుల పాటు వాయిదా
వేసుకోవడం తాజాగా కోలీవుడ్ లో విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ... ఆ
అతిధి ఎవరంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్! అజిత్ హీరోగా నటిస్తున్న
'బిల్లా-2' చిత్రం ఆడియోను ఏప్రిల్ మొదటి వారంలో రజనీకాంత్ చేతుల మీదుగా
విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఈలోగా రజనీ తన తాజా
చిత్రం 'కొచ్చాడియాన్' షూటింగు కోసం లండన్ వెళ్ళిపోయాడు. అక్కడ నెల రోజుల
పాటు ఈ సినిమా షూటింగును పెట్టుకున్నారు. దాంతో, ఆడియో వేడుకను మరొకరితో
కానిచ్చేయమని రజనీ చెప్పినప్పటికీ, ఆ దర్శక నిర్మాతలు ఒప్పుకోవడం లేదట.
రజనీ స్వదేశానికి వచ్చాకనే వేడుక పెట్టుకుంటాం.. అంటూ తెల్చిచేప్పారట. ఈ
సినిమాను మే నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మరి, ఆడియోను ఎప్పుడు
రిలీజ్ చేస్తారో... సినిమాను ఎప్పుడు చేస్తారో?
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)