ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమిళ విలన్ గా జగపతిబాబు ?

Wed, Mar 14, 2012
తమిళంలో 'తాండవం' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అనుష్క - విక్రమ్
నాయికా నాయకులుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రని
పోషిస్తున్నట్టు ఆ మధ్య హైదరాబాద్ ఫిల్మ్ సర్కిల్స్ లోనూ వినిపించింది.
అయితే అందరూ కూడా బహుశా అది సెకండ్ హీరో కేరక్టర్ కావచ్చని అనుకున్నారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇంచు మించు అది విలన్ టైపు కేరక్టర్ అని
తెలుస్తోంది. ఆ సినిమాలో అది చాలా పవర్ ఫుల్  కేరక్టర్ అనీ ... అందువల్లనే
జగపతిబాబు అంగీకరించాడని అంటున్నారు. గతంలో హీరో సుమన్ కూడా తమిళ
చిత్రాల్లో విలన్ గా కనిపించారు. ఇప్పుడదే తరహాలో జగపతిబాబు ఈ సినిమా
చేస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి జగపతిబాబు ఎప్పుడూ కూడా హీరోగా
మాత్రమే చేస్తానంటూ భీష్మించుకు కూర్చోలేదు. ప్రాధాన్యతగల పాత్రలని
అంగీకరించి తను మాత్రమే ఆ పాత్రల్ని పండించగలనని నిరూపించారు. అలా ఎన్నో
విభిన్నమైన పాత్రలను పోషించిన జగపతిబాబు, విలన్ పాత్రల్లో సైతం అలరించడం
ఖాయమని సన్నిహితులు చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)