ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఐశ్వర్యరాయ్ కూతురు పేరు ఖరారు

Wed, Mar 14, 2012
ఐశ్వర్యరాయ్ తన అందచందాలతో విశ్వ సుందరిగా ప్రపంచ ప్రేక్షకుల అభినందనలు
అందుకుంది. తను కదిలినా మెదిలినా మీడియా స్పందించే స్థాయికి ఎదిగింది.
అమితాబ్ కోడలిగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత ఆ కుటుంబ నేపథ్యంతో ఆమె
పేరు ప్రతిష్టలు మరింత పెరిగాయి. ఇటీవల ఆమె ఓ ఆడ శిశువుకి జన్మనిచ్చింది.
సాధారణంగానే ఐశ్వర్య రాయ్ కూతురు ఎలా వుంటుందో చూడాలని ప్రతి ఒక్కరూ
అనుకుంటారు. ఆ పాపకి ఏ పేరు పెట్టారో తెలుసుకోవాలని ఆరాటపడతారు. అయితే ఈ
రెండు విషయాలను బచ్చన్ కుటుంబీకులు గోప్యంగానే ఉంచుతూ వచ్చారు.

 ఈ నేపథ్యంలో
ఐశ్వర్య రాయ్ కూతుర్ని ఇదిగిదిగో చూపించేస్తున్నారంటూ ప్రచారాలు
మొదలయ్యాయి. ఐశ్వర్య కూతురుకి అభిలాష అని నామకరణం చేశారంటూ
వార్తలు షికారు చేశాయి. ఇక ఇప్పుడు ఆ గాసిప్పులన్నిటికీ బచ్చన్ కుటుంబ
సభ్యులు తెర దించేసినట్టు తెలుస్తోంది. ఐశ్వర్య రాయ్ కూతురుకి 'ఆరాధ్య' అనే
పేరుని ఖరారు చేసినట్టు ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది. పేరు చాలా
బావుందనుకుంటూనే ... ఆ పాపని చూసే క్షణం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు
చూస్తోంది. 

 

X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)