ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆర్పీ 'మ్యూజిక్' హంగామా !

Sat, Mar 10, 2012
        
ఆమధ్య కాలంలో వచ్చిన ప్రేమ కథలకి పసందైన పాటలతో ప్రాణం పోసిన సంగీత
దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ ఓ వెలుగు వెలిగారు. ఆ తరువాత ఆయన నటన పై ఆసక్తి
పెంచుకుని 'శీను వాసంతి లక్ష్మి' వంటి చిత్రాలతో తెరమీదకి వచ్చారు. ఈ రెండు
పడవల పై ప్రయాణం చేస్తూనే దర్శకుడిగా మూడో అవతారం ఎత్తారు. ఈ నేపథ్యంలో
... ఆ మధ్య 'బ్రోకర్' సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అంచనాలు
పెంచుకునే సినిమా కాదు కాబట్టి ఎలా వచ్చిందో ... అలాగే వెళ్లి పోయింది.
         ఇక
ప్రస్తుతం ఆయన 'ఫేస్ బుక్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యూత్ కి సందేశం
ఇవ్వనున్న ఈ సినిమా తనకి మంచి పేరు తెస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఈ సినిమా
తరువాత 'మ్యూజిక్' అనే చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నట్లు ఆర్పీ
చెప్పారు. సంగీతం నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాకి, కథ - స్క్రీన్ ప్లే -
సంగీతం - దర్శకత్వం బాధ్యతలను తానే నిర్వహిస్తానని అన్నారు. నూతన నటీనటులతో
తెరకెక్కించే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తానని
చెప్పారు.  
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)