ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఆహా ఉల్లాల్' అంటోన్న కుర్రకారు

Thu, Mar 08, 2012
         
స్నేహా ఉల్లాల్ ని చూసిన వాళ్లెవరైనా, అమ్మాయి బావుంది ... కాస్త అటు ఇటుగా
ఐశ్వర్య రాయ్ లా అనిపిస్తుందనే అంటారు. ఈ కారణంగానే ఆమెకి సినిమాల్లో
అవకాశాలు వచ్చాయి ... ప్రేక్షకుల్లో ఓ గుర్తింపును తీసుకొచ్చాయి.
'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన స్నేహా ఉల్లాల్, ఆ
తరువాత నేను మీకు తెలుసా?, కింగ్ (గెస్ట్), కరెంట్ వంటి చిత్రాలలో
నటించింది. ఇవేవీ ఆడకపోయినప్పటికీ, సుకుమారమైన ఆమె సౌందర్యానికి మాత్రం
మంచి మార్కులు పడ్డాయి. దాంతో
భారీ చిత్రంగా వచ్చిన 'సింహా' లో బాలకృష్ణ సరసన ఓ హీరోయిన్ గా ఛాన్స్
కొట్టేసింది. అవకాశమున్నంత వరకూ అందచందాలను ఆరబోసింది.

       విశేషమేమిటంటే, ఈ సినిమా సంచలన
విజయాన్ని సాధించినప్పటికీ అమ్మడుకి మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు.
నిరీక్షణ వల్ల నీరసం రావడం తప్ప ఒరిగేదేమీ లేదని గ్రహించి, తనకి సంబంధించిన
హాట్ వీడియోస్ ని ఇటీవల ట్విట్టర్లో ఉంచింది. ఆమె నాజూకు సౌందర్యాన్ని
చూసేందుకు నలభై కళ్ళు కూడా సరిపోవంటూ కుర్రకారు ఎగబడుతున్నారట. స్నేహా
ఉల్లాల్ ని టాలీవుడ్ కి వదిలేసి చేతులు దులుపుకున్న బాలీవుడ్ కూడా ఈ
రసవత్తరమైన వీడియోలు చూసి షాకైందట. స్నేహా ఉల్లాల్ ని 'ఆహా ఉల్లాల్' అని
పిలుచుకుంటోన్న కుర్రాళ్లు మాత్రం ఆమె నుంచి మరో సినిమాని కాకుండా మరో
వీడియోని ఆశిస్తున్నారని విమర్శకులు అంటున్నారు. మరి ఈ విషయం తెలిస్తే ఆమె ఏ
స్థాయిలో ఫీలౌతుందో ఏమో ...!
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)