ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంగీత సాధన చేస్తున్న కథానాయిక

Wed, Feb 29, 2012
         బాలీవుడ్ సుందరి ప్రియాంకా చోప్రా తానెంత బిజీగా ఉన్నప్పటికీ,
సంగీతానికి సంబంధించి తన అభిరుచిని మాత్రం వదులుకోవడం లేదు. పాశ్చాత్య
శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన ప్రియాంక, త్వరలో ఓ పాప్ ఆల్బం ను విడుదల
చేసే పనిలో వుంది. అందుకోసం ప్రస్తుతం తన సంగీత సాధనను షూటింగు సెట్స్ లో
సైతం కొనసాగిస్తోంది. తన మ్యూజిక్ ట్రైనర్ సమంతా ఎడ్వర్డ్స్ ను తన వెంట
తీసుకువెళుతూ, 'బర్ఫీ' చిత్రం షూటింగులో షాట్ గాప్స్ లో సంగీత సాధన
చేస్తోంది. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో మరింత సాధన చేసి, నిష్ణాతురాలు
కావాలన్నది ఆమె ధ్యేయంగా కనిపిస్తోంది. అందుకే, అంతటి బిజీ షెడ్యూలులోనూ
సంగీత సాధన మరచిపోవడంలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంచితే, తన
తొలి మ్యూజిక్ ఆల్బం విడుదలకు సంబంధించి యూనివెర్సల్ మ్యూజిక్, దేశి
హిట్స్ సంస్థలతో ప్రియాంక ఓ ఒప్పందం చేసుకుంది.  
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)