ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో 'మున్నీ'గా కరీనాకపూర్

Wed, Feb 29, 2012
          ఆమధ్య వచ్చిన 'దబాంగ్' హిందీ చిత్రం బాలీవుడ్ లో ఎంతటి సంచలనాన్ని
సృష్టించిందో మనకు తెలుసు. సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా హీరో
హీరోయిన్లుగా నటించిన ఆ చిత్రానికి 'మున్నీ' ఐటెం సాంగ్ ఎంతో ప్లస్ అయింది.
మలైకా అరోరా చేసిన ఆ పాట చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడీ
చిత్రానికి సీక్వెల్ (దబాంగ్-2) నిర్మిస్తున్నారు. సల్మాన్, సోనాక్షి
నటిస్తున్న ఈ సీక్వెల్ లో కూడా 'మున్నీ' పాటలా ఓ ఐటెం సాంగ్ పెడుతున్నారట.
అయితే, ఈ పాటకు ఈసారి మరింత గ్లామర్ తీసుకురావడానికి బాలీవుడ్ అగ్ర
కథానాయిక కరీనా కపూర్ చేత ఈ ప్రత్యేక గీతాన్ని చేయిస్తున్నారు. అందుకు
కరీనా కూడా ఒప్పుకుందనీ, అయితే, పెద్ద మొత్తంలోనే చార్జ్ చేస్తోందనీ
బాలీవుడ్ సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)