ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు.... టూకీగా

Wed, Feb 22, 2012
*  కథానాయిక శృతి హాసన్ తమిళం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు
కనిపిస్తోంది. తాజాగా విశాల్ పక్కన నటించడానికి అంగీకరించిందని
తెలుస్తోంది. సుందర్ సి దర్శకత్వంలో విశాల్ త్రిపాత్రాభినయం చేసే చిత్రంలో
ప్రధాన కథానాయుకగా శృతి ఎంపికైందట.

*  అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ దంపతులకు పుట్టిన పాపాయి పేరు మీడియాకు ఇప్పుడు పెద్ద వార్త అయిపోతోంది. 'బేటి బి' కి అభిలాష అనే పేరు ఖాయం చేసినట్టుగా ముంబయ్ నుంచి వార్తలొస్తున్నాయి.

*  ప్రముఖ నిర్మాత పర్వతనేని మల్లికార్జునరావు (76) నిన్న హైదరాబాదులో
మరణించారు. జ్వాలాద్వీప రహస్యం, ఇద్దరు మొనగాళ్ళు, మంచి కుటుంబం, మంచి
మిత్రులు, ఇంటి గౌరవం, మహాబలుడు... వంటి పలు చిత్రాలను ఆయన నిర్మించారు.
హిందీలో కూడా ఆయన కొన్ని చిత్రాలు నిర్మించడం విశేషం.

*  కొంత గ్యాప్ తర్వాత నితిన్ హీరోగా నటించిన 'ఇష్క్' చిత్రం అన్ని
కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ 24 న విడుదలవుతోంది. విక్రం కుమార్
దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్ కథానాయికగా నటించింది.

*  రామ్ చరణ్ కథానాయకుడుగా నటిస్తున్న 'రచ్చ' సినిమా బడ్జెట్ అంతకంతకు
పెరిగిపోతోందని టాలీవుడ్ లో వినిపిస్తోంది. చరణ్ పారితోషికం లెక్క
వేయకుండానే... ఇప్పటికే బడ్జెట్ 30 కోట్లు దాటిందని అంటున్నారు!
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)