ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శివపూజలో లీనమవుతున్న సల్మాన్!

Mon, Feb 20, 2012
         బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అవ్వడానికి ముస్లిం అయినా, హిందూ
పండగలన్నా, దేవుళ్లన్నా అతనికి ఎంతో భక్తి. ప్రతి ఏడాది వినాయకచవితికి
గణేష్ పూజ భారీ ఎత్తున నిర్వహిస్తుంటాడు. అలాగే, ఈ రోజు ముంబై శివారులోని
తన ఫాం హౌస్ లో కుటుంబ సభ్యులతో కలిసి శివరాత్రి ఉత్సవాన్ని భారీగా
జరుపుతున్నాడు. క్యూబాలో ఓ సినిమా షూటింగులో పాల్గొని, నిన్ననే ముంబాయ్
వచ్చిన సల్మాన్ సరాసరి ఫాం హౌస్ కి వెళ్ళిపోయాడు. అప్పటికే అక్కడ ఓ హిందూ
పూజారిని కూడా రప్పించి ఉంచారు. ఫాం హౌస్ ని రకరకాల పూలతో శివుడి ప్రతిమలతో
అలంకరించారట. ఈ రాత్రి శివరాత్రి వేడుకను కన్నుల పండువగా జరపడానికి ప్లాన్
చేశాడు. శివుడంటే మన సల్లూభాయ్ కి అంత ఇష్టమన్న మాట! ఇలా హిందూ పండుగలను
కూడా సెలబ్రేట్ చేస్తూ మతసామరస్యానికి అసలైన ప్రతీకగా సల్మాన్
నిలుస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)